రాహుల్ కనుక రాజీనామా చేస్తే.. బీజేపీ ట్రాప్లో చిక్కుకున్నట్టే: ప్రియాంక గాంధీ
- సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి రాహుల్ నైతిక బాధ్యత
- కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన
- అలా చేస్తే బీజేపీ గెలిచినట్టు అవుతుందన్న ప్రియాంక
మరోవైపు, తన సోదరుడి రాజీనామా వార్తలపై ప్రియాంక గాంధీ స్పందించారు. రాహుల్ కనుక రాజీనామా చేస్తే బీజేపీ ట్రాప్లో పడినట్టే అవుతుందని పేర్కొన్నారు. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగాల్సిందేనని అన్నారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించగా నేతలు సుతిమెత్తగా తోసిపుచ్చారు. రాహుల్ రాజీనామాను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ రాహుల్కు ఉందని పేర్కొన్నారు.