: ఐపిఎల్ లో ఫిక్సింగ్.. రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ల అరెస్ట్
ఐపిఎల్ లో ఫిక్సింగ్ దుమారం రేగింది. తొలి నుంచీ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇదే విషయమై రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణపై అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు చెందిన ఏడుగురు బుకీలను కూడా అరెస్ట్ చేశారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయేమో చూడాలి. ఏదైనప్పటికీ, ప్రముఖ క్రికెటర్లు అరెస్టవడం సంచనలం కలిగిస్తోంది