Chandrababu: సీఎం పదవికి రాజీనామా చేసిన చంద్రబాబు
- గవర్నర్ కు రాజీనామా లేఖ
- వెంటనే ఆమోదించిన గవర్నర్
- కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు సీఎంగా కొనసాగాలని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబు కాసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ కు పంపారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ వెంటనే ఆమోదించారు. ఏపీకి చంద్రబాబు చేసిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలంటూ చంద్రబాబుకు సూచించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం నేపథ్యంలో చంద్రబాబు రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు వైసీపీ 100 సీట్లు గెలిచి మరో 50 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ 13 స్థానాలు గెలిచి మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.