Chandrababu: టీడీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇవే!
- వైజాగ్ లో ముందంజ
- ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న పోరు
- లోక్ సభ ఫలితాల్లో మరీ దారుణం!
తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు దారుణ పరాభవాన్ని మిగల్చనున్నాయి. కౌంటింగ్ మొదలైన గంటలోపే పరిస్థితి ఎలా ఉందో అర్థమైపోయింది. తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీడీపీకి ఓటమి తప్పదన్న భావన నెలకొంది.
కాగా, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అద్దంకి, చీరాల, కందుకూరు, పర్చూరు, హిందూపురం, ఇచ్ఛాపురం, కుప్పం, తాడికొండ, రేపల్లె, గుంటూరు వెస్ట్, పాతపట్నం, తిరువూరు, కైకలూరు, విజయవాడ ఈస్ట్, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, పెద్దాపురం, మండపేట, రామచంద్రాపురం, బాపట్ల అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరికొన్ని నియోజకవర్గాల వివరాలు తెలియాల్సి ఉంది.
మరీ దారుణం ఏంటంటే, లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశాలు కనిపించడంలేదు. మొత్తం 25 స్థానాలకు గాను వైసీపీ అన్నింటా ముందంజలో నిలిచింది.