Andhra Pradesh: జగన్ ఇంట్లో దిగిపోయిన ప్రశాంత్ కిశోర్ టీమ్.. వార్ రూమ్ లో కౌంటింగ్ పరిశీలన!

  • జగన్ ఇంట్లో వార్ రూమ్ ఏర్పాటు
  • 126 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
  • ఎన్నికల సరళిపై జగన్ కు అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతున్న వేళ జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన టీమ్ అమరావతికి చేరుకుంది. అమరావతిలోని తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసానికి చేరుకున్న ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ టీమ్ ‘వార్ రూమ్’లో కౌంటింగ్ సరళిని పరిశీలిస్తోంది.

మరోవైపు అనంతపురం జిల్లాలోని శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల్లో వైసీపీ దూసుకుపోతోంది. తాజా అప్ డేట్స్ ప్రకారం వైసీపీ 126 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుండగా, టీడీపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

  • Loading...

More Telugu News