YSRCP: లీడింగ్ లో సెంచరీ దాటేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ!

  • దూసుకెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్
  • 126 స్థానాల్లో వెల్లడైన ట్రెండ్స్
  • 101 చోట్ల వైసీపీ ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, 126 స్థానాల ట్రెండ్స్ వెల్లడయ్యాయి. వైసీపీ ఆధిక్యంలో సెంచరీని దాటేసింది. ఆ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులు 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తెలుగుదేశం 23 స్థానాల్లోనూ, జనసేన 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక లోక్ సభ విషయానికి వస్తే వైసీపీ 8 చోట్ల, టీడీపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News