India: మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు!

  • ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
  • లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు
  • ఏపీ అసెంబ్లీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

ఇవాళ జరిగిన ఏడో విడత పోలింగ్ తో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. సుమారు రెండు నెలల పాటు జరిగిన ఈ ఎన్నికల సంరంభంలో లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంతో గెలుపు ఎవరిదన్న అంచనాల నడుమ ప్రజలు ఉత్కంఠకు గురవుతున్నారు. మే 23న ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువరిస్తారు. అయితే, మీడియా సంస్థలు ఈ సాయంత్రం నుంచే ఎగ్జిట్ పోల్స్ తో హడావుడి చేసేందుకు సిద్ధమయ్యాయి. పలు జాతీయ మీడియా చానళ్లతో పాటు తెలుగు న్యూస్ చానళ్లు కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రజల ముందుంచేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

  • Loading...

More Telugu News