Telangana: పదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. కరీంనగర్ వాసికి న్యూజిలాండ్ లో 14 ఏళ్ల జైలుశిక్ష

  • 2003లో ఘటన
  • యుక్త వయస్సుకొచ్చిన బాలికకు మానసిక వ్యాకులత
  • రెండేళ్లుగా కోర్టులో విచారణ

తెలంగాణకు చెందిన సల్వాజి సీతారామారావు అనే వ్యక్తికి న్యూజిలాండ్ లో 14 ఏళ్ల జైలుశిక్ష విధించారు. సీతారామారావు పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు. సీతారామారావు 19 ఏళ్ల క్రితం కరీంనగర్ నుంచి న్యూజిలాండ్ వలస వెళ్లారు. అయితే, 2003లో ఓ పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అప్పట్లో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బయటకు చెప్పుకోవడానికి ఆ పాప ఎంతో భయపడిపోయింది. యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఆనాటి ఘటన కారణంగా ఎంతో కుంగుబాటుకు గురైంది. ఎట్టకేలకు 2017లో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పటినుంచి రెండేళ్లపాటు ఈ కేసును విచారించిన న్యాయస్థానం సీతారామారావు దోషి అని తేల్చి కఠినకారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన 16 ఏళ్ల తర్వాతైనా నిందితుడికి శిక్ష పడడం పట్ల న్యూజిలాండ్ లో హర్షం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News