India: కుట్లు, అతుకులు లేని త్రివర్ణ పతాకం తయారీ కోసం సొంత ఇంటిని అమ్ముకున్న ఏపీ చేనేత కార్మికుడు

  • ఒకే వస్త్రంగా త్రివర్ణ పతాకం
  • రూ.6.5 లక్షల ఖర్చవుతుందని అంచనా
  • సొంతింటిని అమ్మేసి అద్దె ఇంట్లో చేరిక

భారత జాతీయ పతాకం మూడు రంగులతో ఎంతో విభిన్నంగా కనిపిస్తుంది. అయితే, దాంట్లో కనిపించే కాషాయం, తెలుపు, పచ్చని రంగులను విడివిడిగా రూపొందించి ఆపై కలిపి కుట్టేస్తారు. కానీ, ఏపీకి చెందిన ఓ చేనేత కార్మికుడు మూడు రంగులను ఒకే వస్త్రంపై ఎలాంటి కుట్లు, అతుకులు లేకుండా రూపొందించడానికి పూనుకుని, అందుకు భారీగా ఖర్చవుతుందని తెలియడంతో సొంత ఇంటిని సైతం అమ్ముకున్నాడు.

పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామానికి చెందిన ఆర్. సత్యనారాయణ ఓ చేనేత కార్మికుడు. భారత త్రివర్ణ పతాకాన్ని ఇప్పటివరకు ఎవరూ తయారుచేయని రీతిలో  ఒకే వస్త్రంగా రూపొందించాలన్నది అతని లక్ష్యం. చేనేత మగ్గంపై తయారుచేయడానికి రూ.6.5 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసి, ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇంటిని విక్రయించాడు. ఆపై ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని అందులోనే తన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాడు. 8 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉన్న ఈ త్రివర్ణ పతాకాన్ని ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలో ఉన్న ఎర్రకోటపై ఎగురవేయాలన్నది అతని కోరిక.

  • Loading...

More Telugu News