: యడ్యూరప్పను వదలని ముడుపుల కేసు


కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశానన్న ఆనందం యడ్యూరప్పకు కొన్ని రోజులే మిగిలేట్టుంది. గనుల అక్రమతవ్వకం, ముడుపుల కేసుల్లో ఆయన నేడు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ ఈ కేసులో యడ్యూరప్పతో పాటు ఆయన కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర, అల్లుడు సోహన్ కుమార్ లను నిందితులుగా పేర్కొనడంతో వారూ కోర్టుకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో మొత్తం 13 మందిపై ఛార్జిషీటు నమోదు చేసిన సీబీఐ.. యడ్యూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అందులో పేర్కొంది. ఈ క్రమంలో యడ్యూరప్పపై 120-బి, 420, 1988 అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News