: మరాఠీ పాఠ్యపుస్తకాల నుంచి మాయమైన అరుణాచల్ ప్రదేశ్!
మహారాష్ట్ర జాగ్రఫీ పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన భారతదేశ చిత్ర పటం నుంచి అరుణాచల్ ప్రదేశ్ మాయమైంది. పదవ తరగతి పుస్తకాల్లో ఈ తప్పిదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ సెకండరీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డును ఆదేశించింది. ఈ పుస్తకాలు సర్కారు అధీనంలోని బాలభారతి ముద్రణాలయంలో ప్రచురితమయ్యాయి. కాగా, ఆ పుస్తకాల్లో అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ కు చెందినదిగా కాకుండా చైనా భూభాగంగా చూపడం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది.