Chandrababu: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
- వెల్దుర్తి వద్ద దుర్ఘటన
- 15 మంది మృతి
- ఘటన జరిగిన తీరు పట్ల సీఎం దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఈ సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ కు చెందిన బస్సు, తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తుఫాన్ వాహనంలో ఉన్న 15 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఘటన జరిగిన తీరు పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.