: సల్మాన్ ఖాన్ కు ఊరట


కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. రాజస్థాన్ ప్రభుత్వం సల్మాన్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు నేడు తిరస్కరించింది. అంతేగాకుండా, నాలుగేళ్ళుగా ఈ కేసును పెండింగ్ లో ఉంచిన కింది కోర్టును వేగవంతంగా విచారణ సాగించాలని కూడా ఆదేశించింది. 1998లో ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా సల్మాన్, సైఫ్, టాబూ, సోనాలి బెంద్రే, నీలమ్ తదితరులు రాజస్థాన్ లోని కంకాణి గ్రామం వద్ద రెండు జింకలను వేటాడి వధించారు. దీంతో, వీరిపై వన్యప్రాణి రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News