: కోడలు అంటే పనిమనిషి కాదు: సుప్రీం వ్యాఖ్య


కోడలు అంటే ఇంట్లో పనిమనిషి కాదని, ఆమెను అత్తవారింట కుటుంబ సభ్యురాలిగానే చూడాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏ సమయంలోనూ ఆమెను అత్తవారింటి నుంచి గెంటివేయరాదని కూడా పేర్కొంది. భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, ఆమె చావుకు కారకుడయ్యాడంటూ ఓ వ్యక్తికి ఐదేళ్ళు జైలుశిక్ష విధించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

నాగరిక సభ్యసమాజం సున్నిత భావాలను ప్రతిబింబించేలా మెట్టినింట వధువుకు సముచిత గౌరవం కల్పించాలని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సూచించింది. గృహహింస కారణంగా ఎందరో మహిళలు జీవితాలను బలవంతంగా ముగించుకుంటున్నారని సుప్రీం విచారం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News