YSRCP: నేనింకా సిట్టింగ్ ఎంపీనే... మే 23 తర్వాత నీ సంగతి చూస్తా: సింహాచలం ఈవోకు అవంతి శ్రీనివాస్ వార్నింగ్

  • గర్భాలయంలోకి అనుమతి నిరాకరించారంటూ ఆగ్రహం
  • ఈవోపై మండిపడిన ఎంపీ
  • నేను మాజీని కాదంటూ హూంకరింపు

అనకాపల్లి ఎంపీ, వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ సింహాచలం ఆలయ ఈవోపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఇవాళ శ్రీ సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం నిర్వహించిన సందర్భంగా అవంతి శ్రీనివాస్ కూడా ఆలయానికి విచ్చేశారు. అయితే, తనను ఈవో గర్భగుడిలోకి అనుమతించలేదన్నది అవంతి ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆలయ ఈవోను సీరియస్ గా హెచ్చరించారు. తాను ఇంకా సిట్టింగ్ ఎంపీనే అని, తాను అప్పుడే మాజీని కాలేదని చెప్పిన అవంతి, మే 23 తర్వాత నీ సంగతి చూస్తానంటూ ఈవోకు వార్నింగ్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News