Andhra Pradesh: ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం... పలు చోట్ల పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసిన ఆర్టీజీఎస్

  • ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
  • విజయవాడలో వర్షం
  • విద్యుత్ సరఫరాకు అంతరాయం

రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం పట్ల ఆర్టీజీఎస్ అప్రమత్తమైంది. కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడొచ్చంటూ హెచ్చరికలు జారీచేసింది. గుంటూరు జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, దుగ్గిరాల మండలాల్లో పిడుగులు పడొచ్చని తెలిపింది.

కృష్ణా జిల్లాలో విజయవాడ, పెనమలూరు, నూజివీడు, బాపులపాడు, పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాంతాలకు రాగల 40 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, విజయవాడ, అమరావతిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు హోర్డింగ్ లు, కటౌట్లు ధ్వంసమయ్యాయి. దాంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News