Telangana: తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక బయోమెట్రిక్ విధానం

  • సిబ్బంది హాజరుపై ఆరోగ్య శాఖ సమీక్ష
  • డాక్టర్ల హాజరు విషయంపై చర్చ
  • బయోమెట్రిక్ తో సత్ఫలితాలు వస్తాయంటున్న సర్కారు

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకమీదట బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. ప్రధాన ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో బయోమెట్రిక్ పరికరాలు అమర్చేందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నిర్ణీత పనిగంటల పాటు ఆసుపత్రిలో ఉండే విధంగా ఈ బయోమెట్రిక్ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జరిపిన సమీక్షా సమావేశంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా, డాక్టర్ల విషయంలో 20 నుంచి 30 శాతం తక్కువ హాజరు నమోదవుతున్నట్టు గుర్తించారు. చాలామంది ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ఆసుపత్రుల్లో అధిక సమయం గడుపుతూ తాము విధులు నిర్వర్తించాల్సిన ఆసుపత్రులకు సరిగా రావడం లేదని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విధానం వైద్య సిబ్బంది వైఖరిలో మార్పు తెస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News