UK: తండ్రయిన బ్రిటన్ యువరాజు హ్యారీ

  • పండంటి మగశిశువుకు జన్మనిచ్చిన హ్యారీ అర్ధాంగి
  • తల్లీబిడ్డలు క్షేమం అని ప్రకటించిన రాజసౌధం
  • శిశువుకు రెండు దేశాల పౌరసత్వాలు

బ్రిటన్ రాజకుటుంబంలో మరో వారసుడు అడుగుపెట్టాడు. బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ హ్యారీ తండ్రయ్యారు. హ్యారీ అర్ధాంగి మేఘాన్ మార్కెల్ ఇవాళ పండంటి మగశిశువుకు జన్మనిచ్చినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. హ్యారీ, మేఘాన్ దంపతులకు ఇదే మొదటి సంతానం.

కాగా, శిశువుకు రెండు దేశాల పౌరసత్వం లభించడం విశేషం అని చెప్పాలి. తండ్రి హ్యారీ నుంచి బ్రిటీష్ పౌరసత్వం, తల్లి మేఘాన్ నుంచి అమెరికా పౌరసత్వం సంక్రమిస్తాయి. కాగా, బ్రిటన్ యువరాజుకు వారసుడు జన్మించడం పట్ల ప్రధాని థెరెసా మే శుభాకాంక్షలు తెలియజేశారు.

అమెరికాకు చెందిన  మేఘాన్ మార్కెల్ నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె సినిమాలతో పాటు అనేక టెలివిజన్ కార్యక్రమాల్లోనూ నటించారు. మేఘాన్ కు హ్యారీతో జరిగింది రెండో పెళ్లి. ఆమెకు గతంలో హాలీవుడ్ దర్శకుడు ట్రెవర్ ఏంగెల్సన్ తో వివాహం జరిగింది. పెళ్లయిన రెండేళ్లకే ఈ జంట విడిపోయింది. ఆపై ప్రిన్స్ హ్యారీతో ప్రేమాయణం మేఘాన్ ను బ్రిటన్ రాజకుటుంబంలో అడుగుపెట్టేలా చేసింది.

UK
  • Loading...

More Telugu News