Chandrababu: రంజాన్ ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది: చంద్రబాబు
- రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం
- రంజాన్ దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉంది
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం మంగళవారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం అని, నెలరోజుల పాటు నిష్టగా చేసే దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. రంజాన్ సందర్భంగా చేసే ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అటు, ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కూడా ముస్లింలకు రంజాన్ విషెస్ తెలిపారు.