India: దేశవ్యాప్తంగా ముగిసిన ఐదో దశ పోలింగ్
- 7 రాష్ట్రాల్లో 51 స్థానాలకు ఎన్నికలు
- బరిలో రాహుల్, సోనియా, స్మృతి
- జమ్మూకశ్మీర్లో అత్యల్ప ఓటింగ్ శాతం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఐదో దశ ఎన్నికలు నిర్వహించారు. 7 రాష్ట్రాల్లో 51 లోక్ సభ నియోజకవర్గాలకు గాను పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్ లో 14, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో 7, మధ్యప్రదేశ్ లో 7, బీహార్ లో 5, ఝార్ఖండ్ లో 4, జమ్మూకశ్మీర్ లో 2 స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. ఐదో దశ ఎన్నికల్లో 674 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది.
కాగా, సాయంత్రం 5 గంటల సమయానికి పోలైన ఓట్ల శాతం ఇలా ఉంది...
- పశ్చిమ బెంగాల్-65.01
- ఝార్ఖండ్-58.07
- మధ్యప్రదేశ్-54.39
- రాజస్థాన్-51.99
- బీహార్-48.12
- ఉత్తరప్రదేశ్-45.87
- జమ్మూకశ్మీర్-15.51