: అక్రమాల విచారణపై ఏపీఎన్జీవో సంఘం నేతల అభ్యంతరం
ఏపీ ఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ హైదరాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం సరికాదంటూ ఏపీఎన్జీవో సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ విచారణ జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ 120 రోజుల్లో జరగాల్సి ఉండగా కేవలం ఒక్క రోజు మాత్రమే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తూతూమంత్రంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వంలోని రోడ్లు, భవనాల శాఖాధికారులు తనిఖీలు చేయాల్సి ఉండగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో విచారణ చెయ్యించడం సరికాదని, దీనిపై పున:విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఏపీఎన్జీవో సంఘం నేతలు డిమాండ్ చేసారు.