: జూన్ 15 వరకు ఓటర్ల సవరణ: భన్వర్ లాల్
రేపటి నుంచి జూన్ 15 వరకూ ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. 66 వేల మంది అధికారులు ఇంటింటికీ వెళ్ళి ఓటర్ల జాబితా సవరణ చేపడతారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు జనవరి లోపు ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేసారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని భన్వర్ లాల్ తెలిపారు.