BJP: నాకు తెలుసు... సైన్యం మొత్తం మోదీవైపే ఉంది: రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు
- కాంగ్రెస్ సర్జికల్ దాడులను వారినే ఉంచుకోమనండి
- నేనూ సైన్యంలో పనిచేశా
- అక్కడేం జరుగుతుందో నాకు తెలుస్తుంది
బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో తరచుగా సైన్యం గురించి ప్రస్తావిస్తూ విమర్శల పాలవుతోంది. అయినప్పటికీ ఆ పార్టీ నేతలు ఎక్కడా వెనక్కితగ్గడంలేదు. తాజాగా, తమ హయాంలో కూడా సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయని కాంగ్రెస్ చెప్పుకోవడంపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన సర్జికల్ దాడులను వారినే ఉంచుకోమనండి అంటూ విమర్శించారు.
తాను కూడా ఒకప్పుడు భారత సైన్యంలో పనిచేసిన వ్యక్తినని, సైన్యంలో ఏం జరుగుతుందో, ఏం జరగడంలేదో అన్నీ తెలుస్తుంటాయని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ పక్షానే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ మద్దతు బీజేపీకేనని స్పష్టం చేశారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, ఆర్మీ సంగతి తనకు తెలుసని స్పష్టం చేశారు.