BJP: దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ముస్లిం మహిళలు త్యాగాలు చేయాలి: సాధ్వీ ప్రజ్ఞా సింగ్

  • బుర్ఖాలను త్యాగం చేయాలి
  • కొన్ని సంప్రదాయాలను పక్కనబెట్టాలి
  • దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

శ్రీలంక పేలుళ్ల అనంతరం అందరి దృష్టి బుర్ఖాలపై పడింది. ఉగ్రవాదులు బుర్ఖాల్లో వచ్చి విధ్వంసాలకు పాల్పడుతున్నారంటూ లంక ప్రభుత్వం బుర్ఖాలపై నిషేధం విధించింది. దీనిపై భారత్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా, బీజేపీ మహిళానేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కూడా స్పందించారు. బుర్ఖాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే ముస్లిం మహిళలు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని బుర్ఖాలను త్యాగం చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పటినుంచో వస్తున్న కొన్ని సంప్రదాయాలను దేశం కోసం పక్కనబెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ ప్రజలు ఎవరైనా దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజ్ఞా సింగ్ స్పష్టం చేశారు.

BJP
  • Loading...

More Telugu News