: రఘునందన్ కు హరీశ్ రావు సవాల్
టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన హరీశ్ రావు, తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. తిరుమల కొండమీద తాను రఘునందన్ నుంచి డబ్బు స్వీకరించానన్న ఆరోపణలను హరీశ్ ఖండించారు. ఏదో జేబు ఖర్చులకు అవసరమై ఐదో, పదివేలో తీసుకుని ఉంటానని, ఆ విషయం సరిగా గుర్తులేదని వివరించారు. అయినా, అందుకు ఆధారాలున్నాయంటున్న రఘునందన్, ఆ సీడీలను విడుదల చేయాలని సవాల్ విసిరారు. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలంటూ వేటుకు గురైన నేతకు హరీశ్ రావు హితవు పలికారు.