Telangana: శ్రావణి హత్యాచార ఘటన మరువకముందే అదే బావిలో బయటపడిన మరో అమ్మాయి శవం!

  • యాదాద్రి జిల్లాలో ఘటన
  • నెలరోజుల కిందట అదృశ్యమైన డిగ్రీ విద్యార్థిని
  • మృతురాలు మనీషా అని భావిస్తున్న పోలీసులు

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో శ్రావణి అనే అమ్మాయి బావిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. శ్రావణిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఏడుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో శ్రీనివాస రెడ్డి అనే నిందితుడిని విచారిస్తుండగా, మరో హత్య ఘటన కూడా వెలుగు చూసింది. మరో అమ్మాయి శవాన్ని కూడా ఆ బావిలో పూడ్చి పెట్టినట్టు చెప్పాడని తెలుస్తోంది. దీంతో మృతురాలిని నెలరోజుల కిందట అదృశ్యమైన మనీషాగా భావిస్తున్నారు.

హాజీపూర్ గ్రామానికే చెందిన మనీషా డిగ్రీ విద్యార్థిని.  మనీషాకు తండ్రి లేడు. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. తల్లే నలుగురు పిల్లల్నీ పోషిస్తోంది. కాగా,హాజీపూర్ బావిలో మరో మృతదేహం లభించిందన్న సమాచారంతో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సంఘటన స్థలానికి బయల్దేరారు. పోలీసులు మృతదేహం తవ్వితీసే క్రమంలో గ్రామస్తులను ఎవరినీ అక్కడికి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News