: చౌక దుకాణాల్లో కోటా 15 కిలోలకు పెంచాలి: మంద కృష్ణ
రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఇస్తున్న బియ్యం కోటాను 15 కిలోలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేసారు. గత 15 ఏళ్ళుగా ఒక్కొక్కరికీ 4 కేజీలు చొప్పున ఇస్తున్న కోటా ఏ మూలకూ సరిపోవడం లేదన్నారు. గతంలో కోటా బియ్యంను 4 నుంచి 6 కిలోలకు పెంచుతామన్న ప్రభుత్వం తన హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. మార్కెట్ లో బియ్యం ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో పేదలు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని లిబర్టీ సర్కిల్ నుంచి వరంగల్ వరకూ ఆకలి కేకల పోరుయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామన్నారు.