Telugudesam: అప్పగించిన పనులు చేయకుండా సీఎస్, సీఈవో రాజకీయాలు చేస్తున్నారు: వైవీబీ రాజేంద్రప్రసాద్

  • ఎన్నికల నియమావళిలో మార్పులు చేయాలి
  • పోలింగ్ ముగిసినా కోడ్ పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
  • 120 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాల్లో గెలుపు మాదే

టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల నియమావళిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా కోడ్ అమలులో ఉందంటూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

అప్పగించిన పనులు చేయకుండా సీఎస్, సీఈవో రాజకీయాలు చేస్తున్నారంటూ వైవీబీ మండిపడ్డారు. వాళ్లిద్దరూ పరిధికి మించి జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం ప్రదర్శించారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఈసారి ఎన్నికల్లో తమదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎంతో మెరుగైన తీరులో 120 అసెంబ్లీ స్థానాలు, 20 లోక్ సభ స్థానాల్లో గెలుపు టీడీపీదేనని చెప్పారు.

  • Loading...

More Telugu News