అప్పుడే బీజేపీకి ఆరోగ్యం, సైన్స్-టెక్నాలజీ శాఖ మంత్రి దొరికేసింది!: ఒవైసీ సెటైర్లు
- ఆవు మూత్రంతో కేన్సర్ తగ్గిందన్న ప్రజ్ఞా ఠాకూర్
- పంచగవ్య, మూలికలు వాడానన్న నేత
- వెటకారంగా స్పందించిన మజ్లిస్ పార్టీ అధినేత
తాజాగా ఈ వ్యవహారంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా స్పందించారు. ‘చూస్తుంటే బీజేపీకి కొత్త ఆరోగ్యం, సైన్స్-టెక్నాలజీ శాఖ మంత్రి దొరికినట్లు అనిపిస్తోంది. కానీ దురదృష్టవశాత్తూ మోదీ త్వరలోనే మాజీ ప్రధాని కాబోతున్నారు. కాబట్టి మోదీకి ఈ అద్భుతాన్ని చూసే మహాభాగ్యం దక్కదు’ అని ట్వీట్ చేశారు.