మీ ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి.. నాపై ప్రేమను చూపడం సరికాదు.. ఆ వీడియో చూశాక చాలా బాధపడ్డా: లారెన్స్
- కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు
- పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వండి
- వృద్ధులకు సహాయం చేయండి
- ఇలాంటి పనుల్ని నేను ప్రోత్సహించను
ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధపడ్డా. ఇలాంటి రిస్క్‌లను తీసుకోవద్దని నా అభిమానుల్ని కోరుతున్నా. మీ ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి, నాపై ఉన్న ప్రేమను ఇలా చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. వాళ్లని మనసులో ఉంచుకుని ప్రవర్తించండి. నిజంగా మీకు నాపై ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వండి. వారి ఫీజులు కట్టండి. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు చాలా మంది ఉన్నారు, వారికి సహాయం చేయండి. అది నాకు సంతోషాన్నిస్తుంది, గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి పనుల్ని నేను ప్రోత్సహించను. మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదని కోరుతున్నా. మీ జీవితం చాలా ముఖ్యమైంది.. దాన్ని గుర్తు పెట్టుకోండి’ అని లారెన్స్ పోస్ట్ చేశారు.