Jagan: మరీ ఇంత మూర్ఖత్వమా!: కొలంబో పేలుళ్లపై జగన్ దిగ్భ్రాంతి

  • మతిలేనివాళ్లు చేసిన పని ఇది
  • ఇలాంటి చర్యలకు సమాజంలో తావులేదు
  • కొలంబో పేలుళ్లను ఖండించిన జగన్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించడం పట్ల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి రక్త హింసను ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు తన సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి మతిలేని మూర్ఖ చర్యలకు సమాజంలో తావులేదని జగన్ స్పష్టం చేశారు.

ఈస్టర్ సందర్భంగా ప్రార్థనామందిరాల్లో దైవ ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవులపై ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 185 మంది వరకు మరణించినట్టు సమాచారం. వందల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ దాడులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటనలు చేశారు.

  • Loading...

More Telugu News