: కూకట్ పల్లిలో దోపిడీ దొంగల బీభత్సం
హైదరాబాదు మహానగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. నిన్న ఏటీఎంలను దోచుకునేందుకు విఫలయత్నం చేసారు. తాజాగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మూడో ఫేజ్ లో బీభత్సం సృష్టించారు మరి కొందరు దొంగలు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, గొంతు కోసి పరారయ్యారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఏం దోచుకున్నారన్నది తెలియాల్సివుంది.