Jagan: గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించిన వైఎస్ జగన్
- జీసస్ మహాత్యాగానికి గుర్తు ఈ పర్వదినం
- ఆకాశమంత సహనం, అవధుల్లేని త్యాగం... జీసస్ ఇచ్చిన సందేశం
- ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ అధినేత
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజానీకానికి సందేశం ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి జగన్ తరఫున ప్రకటన వెలువడింది. జీసస్ మహాత్యాగానికి గుర్తే ఈ గుడ్ ఫ్రైడే అని జగన్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు కరుణామయుడని, ఆయనను సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, ఆయన సజీవుడై వచ్చిన రోజు ఈస్టర్ సండే... ఈ రెండు దినాలు ప్రపంచ మానవాళి చరిత్రలో కీలక ఘట్టాలు అని వివరించారు.
నిస్సహాయుల పట్ల ఆదరణ, కరుణ... శత్రువుల పట్ల క్షమాగుణం, అవధుల్లేని త్యాగం, ఆకాశమంత సహనం ఏసుక్రీస్తు మానవాళికి బోధించిన అంశాలు అని, ఆయన జీవితమే ఓ సందేశం అని జగన్ తెలిపారు.