Chandrababu: ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి మోదీ ఇక ఆ మాట మాట్లాడకపోవచ్చు: చంద్రబాబు
- మోదీపై విమర్శలు
- పోలవరం ఏటీఎం అన్నారు
- ఏటీడబ్ల్యూ అని మేం చెప్పాం
పోలవరం ప్రాజక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కలిగించినా, వెనుకంజ వేయకుండా పనులు పూర్తిచేస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. పోలవరం అంశంలో ఇప్పటికే పలుమార్లు కేంద్రం తీరును విమర్శించిన ఆయన తాజాగా అధికారులతో సమీక్ష చేపట్టి ఆపై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలవరం ప్రాజక్టును 'ఏటీఎం'గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని, కానీ ఇది 'ఏటీడబ్ల్యూ' (ఎనీ టైమ్ వాటర్) అని నిరూపిస్తామని, ప్రధాని ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఇక ఆయన పోలవరం గురించి మాట్లాడకపోవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.