Jagan: రేపు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్న వైఎస్ జగన్!

  • రాష్ట్రంలో పరిస్థితుల ఏకరవుకు అవకాశం
  • కార్యకర్తలపై దాడుల విషయం ప్రస్తావన
  • జగన్ వెంట పార్టీ సీనియర్లు

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. ఏపీలో పోలింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల అంశంపై జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తమ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ జగన్ తన ఫిర్యాదులో పేర్కొనే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నాయకులు తమపై దాడులు చేశారని గవర్నర్ కు చెప్పనున్నట్టు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు జగన్ వెంట పార్టీ అగ్రనేతలు కూడా రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News