BJP: స్ట్రాంగ్ రూమ్ కు సొంత తాళాలు వేసుకుంటాం, అనుమతించండి: ఈసీని కోరిన నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి

  • సీఈఓకు లేఖ రాసిన అరవింద్ ధర్మపురి
  • ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతపై ఆందోళన
  • అనుమతిస్తే సొంత సెక్యూరిటీ పెట్టుకుంటామంటూ విన్నపం

ఈవీఎంలు, వీవీ ప్యాట్ల విషయం దేశమంతా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఎన్నికల సంఘం అనుమతిస్తే ఈవీంఎలు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంకు సొంత తాళాలు వేసుకుంటానని వినమ్రంగా కోరుతున్నాడు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి.

లోక్ సభ ఎన్నికల్లో అరవింద్ ధర్మపురి బీజేపీ తరఫున నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతపై తమకు సందేహాలున్నాయని, అందుకే ఎన్నికల సంఘం అనుమతిస్తే స్ట్రాంగ్ రూమ్ లకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ ను కలిసి లిఖితపూర్వకంగా అర్థించారు. అంతేకాకుండా, నిజామాబాద్ లో పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం కోరుతూ ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు.

నిజామాబాద్ లో పోలింగ్ శాతం పెరగడంపై తమకు అనుమానాలున్నాయని, కౌంటింగ్ సందర్భంగా ఏదైనా ఈవీఎం యంత్రంలో ఇబ్బంది వస్తే దాన్ని మళ్లీ రీకౌంటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నిజామాబాద్ ఎన్నికల్లో భారీ స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీచేయడం తెలిసిందే. వారిలో అత్యధికులు రైతులే!

BJP
  • Loading...

More Telugu News