విజయసాయి ఫిర్యాదుతో అధికారులను బదిలీ చేయడం సిగ్గుచేటు: బాబు రాజేంద్రప్రసాద్
- బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలి
- గతంలో జీవీఎల్ పుస్తకాలు రాశారు
- కావాలనే అధికారుల బదిలీ
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గతంలో బ్యాలెట్ విధానాన్ని సమర్థిస్తూ పుస్తకాలు కూడా రాశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు విషయంలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారులను కావాలనే బదిలీ చేశారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. స్వతంత్రంగా పని చేయాల్సిన సీఈసీ ప్రధాని మోదీ కనుసన్నల్లో పని చేయడం దారుణమని విమర్శించారు.