Chandrababu: నాది 34 ఏళ్ల అనుభవం, టెక్నాలజీలో పండిపోయాను... మీ టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?: సీఈసీపై చంద్రబాబు ఫైర్
- హ్యాకింగ్ జరుగుతుంది అంటే ఇదసలు వీలేకాదు అంటారా?
- ఏం తెలుసు మీకు?
- ఏం జరగలేదు అని బుకాయిస్తే కుదరదు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు సవాల్ విసిరారు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి... పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలలోకి ఓట్లను అప్ లోడ్ చేయడం, ఈవీఎం కంట్రోల్ యూనిట్ డిస్ ప్లేను ఎక్కడ్నించో నియంత్రించడం, మెమరీ తారుమారు, ఈవీఎంలోని మైక్రో కంట్రోలర్ ను గానీ, మెమరీ చిప్ ను గానీ రీప్లేస్ చేయడం, సాఫ్ట్ వేర్ కోడ్ ను సవరించడం వంటి అనేక మార్గాలు ఉన్నాయని తాను చెప్పానని చంద్రబాబు అన్నారు.
"నేను ఇంత స్పష్టంగా చెబితే, ఆయన ఎంతో సింపుల్ గా "ఇదసలు వీలే కాదు" అన్నాడు. వీలేకాదంటున్నారు, మీ టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఏం తెలుసు మీకు? సూటిగా అడుగుతున్నాను, ఎన్నికల కమిషనర్ గా ఎప్పుడొచ్చారు మీరు? నేను చాలెంజ్ చేస్తున్నా! ఇండియాలో గత 34 ఏళ్లుగా టెక్నాలజీలో పండిపోయాను. రాజకీయవేత్తల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రమోట్ చేసినవాళ్లలో నేను అందరికంటే ముందున్నా. ఈరోజు మీరు అన్నీ మాకు తెలుసు, ఏం కాలేదు అని బుకాయిస్తే కుదరదు. ఎవరికి కావాలి మీ బుకాయింపులు? ఈవీఎంలో పడిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన స్లిప్పులు సరిచూడమంటున్నాం, ఇందులో మీకొచ్చిన నొప్పేంటి?" అంటూ చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను నిలదీశారు.