Chandrababu: రేపు కర్ణాటకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం!
- జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతు
- దేవెగౌడ, కుమారస్వామిలతో ప్రచారం
- మరికొన్ని రాష్ట్రాలకూ వెళ్లే అవకాశం!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతుగా చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో కలిసి చంద్రబాబు పలు సభలతో పాటు రోడ్ షోలలో పాల్గొనే అవకాశాలున్నాయి.
ఏపీలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కోసం దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి జాతీయ ప్రముఖులు వచ్చి ప్రచారం చేయడం తెలిసిందే. ఆ కృతజ్ఞతతోనే చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. కర్ణాటక అనంతరం ఆయన మరికొన్ని రాష్ట్రాలకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి.