east cost: తూర్పుతీరంలో చేపల వేటకు విరామం... నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి నిషేధం
- జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ అనుమతి
- ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్న 90 శాతం బోట్లు
- మిగిలినవి సాయంత్రానికల్లా చేరుకుంటాయన్న అధికారులు
తూర్పుతీరంలో ఏటా అమలు చేసే వేట నిషేధం ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. చేపల సంతానోత్పత్తి సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని ఏటా 45 రోజుల పాటు మత్స్యశాఖ చేపల వేటపై నిషేధం విధిస్తుంది. దీన్ని ఈ ఏడాది రెండు నెలలకు పెంచింది. ఈ ఏడాది 61 రోజులపాటు నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. సంతానోత్పత్తి కాలంలో వేట జరిగితే ఉత్పత్తి క్రమానికి ఆటంకం ఏర్పడుతుంది. మళ్లీ జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి వేటకు అనుమతించనున్నారు. ఈ మేరకు ఏపీ మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క విశాఖ ఫిషింగ్ హార్బర్‌లోనే 708 మెకనైజ్డ్ బోట్లు (మరపడవలు), దాదాపు 3,500 ఇంజిన్ బోట్లు, వెయ్యి వరకు తెప్పలు ఉన్నాయి. ఇవన్నీ రెండు నెలలపాటు తీరంలో కొలువుదీరనున్నాయి.