ఆగివున్న ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం
- కర్నూలు జిల్లా నందవరం మండలంలో ఘటన
- ఉదయం ఐదున్నర గంటల సమయంలో ప్రమాదం
- బాధితులు ఎమ్మిగనూరుకు చెందిన వారు
ఉదయం ఎర్రని కారులో ఎమ్మిగనూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. డ్రైవర్ ట్యాంకర్ను గమనించలేదో, కారు అదుపుతప్పిందోగాని వెనుక నుంచి ఢీకొట్టి లోపలికి దూసుకుపోయింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.