YSRCP: చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
- చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారు
- నిబంధనలు అతిక్రమించారు
- ఈసీని కలిసిన ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతమ్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యక్తిగత విమర్శలు చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతమ్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీ ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన వైసీపీ నేతలు చంద్రబాబు నిబంధనలు అతిక్రమించారని, ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు చేశారని వివరించారు. సీఎంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా యథేచ్ఛగా నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.