Chandrababu: జగన్ తన గురించి చేసిన వ్యాఖ్యలు తలుచుకుని చంద్రబాబు ఆవేదన
- ఏ రాజకీయనాయకుడు ఇలా అనలేదు
- ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండకూడదు
- గెలిస్తే ఎవరికీ రక్షణ ఉండదు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రజావేదికలో ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారంటూ మోదీ, కేసీఆర్, జగన్ లపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో భారీ స్క్రీన్ పై క్లిప్పింగ్స్ వేసి ఎవరెవరు ఏమన్నారో ప్రదర్శించారు. విపక్ష నేత జగన్ తన గురించి గతంలో చేసిన వ్యాఖ్యల క్లిప్ ప్రదర్శించినప్పుడు చంద్రబాబు ఎంతో ఆవేదనకు గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఏ రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా మాట్లాడలేదని బాధను వ్యక్తం చేశారు.
"రాళ్లతో కొట్టాలి, ఓ అమ్మకు అబ్బకు పుట్టాడా? నడిరోడ్డున ఉరితీయాలి? చెప్పుతో కొట్టాలి అంటూ వ్యాఖ్యలు చేశారు... ఏంటిది? చివరికి ఇంట్లో బాబాయి చనిపోతే కూడా గుండెపోటు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ప్రజలకోసమే భరిస్తున్నా" అని చంద్రబాబు తెలిపారు.