Chandrababu: పిల్లల్ని కనడం మానేస్తున్నారు... కొందరు పెళ్లిళ్లే వద్దంటున్నారు: పెడనలో చంద్రబాబు
- పిల్లల్ని కనండి
- వాళ్లు మీకు భారం కాదు
- వాళ్లే మీ ఆస్తి
సీఎం చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పెడనలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు కుటుంబ నియంత్రణ విధానాలు అమలు చేసింది తానేనని, అయితే ఇప్పుడు జనాభా అవసరత దృష్ట్యా కావల్సినంతమందిని కనండి అంటూ పిలుపునిచ్చారు. చాలామంది పిల్లల్ని కనడం మానేస్తున్నారని, కొందరు పెళ్లిళ్లే చేసుకోవడంలేదని, ఇది ఆందోళకర పరిణామం అని పేర్కొన్నారు.
"పిల్లలు మనకు భారం కాదు, ఒకప్పుడు పిల్లలు భారం అనుకునేవాళ్లం, కానీ జనాభా తగ్గిపోతోంది. అందుకే మరింతమంది పిల్లల్ని కనండి. వాళ్లు మీకు ఆస్తి అవుతారే తప్ప భారం కారు" అంటూ ప్రసంగించారు. అందుకే పిల్లల్ని బడికి పంపించే తల్లుల కోసం రూ.18,000 అందజేస్తున్నానని ప్రకటించారు.