సికింద్రాబాద్ లో కూల్ డ్రింక్ లారీ బోల్తా... ఎగబడ్డ స్థానికులు!
- డివైడర్ ను ఢీ కొన్న శీతలపానీయాల లారీ
- పోలీసులు చూస్తున్నా కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లిన స్థానికులు
- లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు
ఈ ప్రమాదంలో లారీడు లోడ్ కూల్ డ్రింక్ బాటిల్స్ కిందపడ్డాయి. వీటికోసం ఎగబడిన స్థానికులు, దొరికినవి దొరికినట్టు తీసుకెళ్లారు. పోలీసులు అక్కడే ఉండి కూడా, బాటిల్స్ తీసుకెళుతున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఆపై క్రేన్ ను రప్పించిన పోలీసులు, లారీని పక్కకు జరిపించి, ట్రాఫిక్ ఆటంకాలను తప్పించారు.