Hyderabad: ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.. 2024లో మళ్లీ ఆశీర్వదించమని కోరతా: వైఎస్ జగన్

  • చంద్రబాబుది పేజీలకు పేజీల మేనిఫెస్టో 
  • వైసీపీ మేనిఫెస్టో మాత్రం ఒకే ఒక పేజీ
  • అన్ని హామీలు నెరవేర్చానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు

2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు, ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నాడు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశానని చంద్రబాబు ‘సిగ్గు లేకుండా’ చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

 ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని, పేజీలకు పేజీల మేనిఫెస్టో పెడుతున్న చంద్రబాబు, ప్రతి కులాన్ని, వర్గాన్ని ఎలా మోసం చేయాలో స్టడీ చేసి మరీ, మోసం చేస్తారని విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టో మాత్రం ఒకే ఒక పేజీ అని, ఈ ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోను చూపిస్తూ, ఫలానా పని చేస్తున్నామని చెబుతానని అన్నారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ప్రజల ముందుకొచ్చి ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చానని చెబుతానని, 2024లో ఆశీర్వదించమని ప్రజలను కోరతానని అన్నారు. 

  • Loading...

More Telugu News