Chandrababu: పెళ్లిపీటల మీద నుంచి పారిపోయిన పెళ్లికొడుకు ఆదాల!: చంద్రబాబు సెటైర్లు
- కందుకూరులో చంద్రబాబు
- సభలో ఆదాలపై విమర్శలు
- పనికిమాలిన వ్యక్తి అంటూ మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదాల ప్రభాకరరెడ్డిపై విమర్శలు గుప్పించారు. పార్టీలో ఉన్నంతకాలం పనులన్నీ జరిపించుకుని ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి పెళ్లిపీటల మీద నుంచి పారిపోయిన పెళ్లికొడుకులా వైసీపీలో చేరాడని ఎద్దేవా చేశారు. ఆదాల పనికిమాలిన వ్యక్తి అని, సీటు ఇచ్చినా పార్టీ నుంచి పారిపోయాడని, వీళ్లా నాయకులు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో బీద మస్తాన్ రావు పార్టీ తరఫున ముందుకొచ్చారని కొనియాడారు. ఆదాల కట్నం తీసుకుని పారిపోయాడు తమ్ముళ్లూ, పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంటూ సెటైర్ వేశారు.