Andhra Pradesh: చంద్రబాబు సర్కారుకు మరో ఎదురుదెబ్బ... రాష్ట్ర సీఎస్ పునేఠాను బదిలీ చేసిన ఈసీ
- ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం
- పునేఠాకు ఎన్నికలకు సంబంధంలేని విభాగం!
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేసిన ఈసీ ఈ పర్యాయం రాష్ట్ర చీఫ్ సెక్రటరీపైనే బదిలీ వేటు వేసింది. రాష్ట్ర సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాను ఎన్నికలకు సంబంధంలేని విభాగానికి పంపాలని సర్కారును ఆదేశించింది. ఇక ఏపీ కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఆయన శనివారం ఉదయం 10.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వివరాలు తెలిపారు.