YSRCP: ఈ పది రోజులూ జగనన్న సైనికులు అప్రమత్తంగా ఉండాలి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- కౌరవుల పరాజయానికి ఇంకా పది రోజులే ఉంది
- ప్రత్యర్థులు మాయోపాయాలకు పాల్పడతారు జాగ్రత్త
- వాటిని తిప్పి కొట్టండి
ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవుల పరాజయానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉందని, ఈ పది రోజులు జగనన్న సైనికులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ప్రత్యర్థులు అన్ని రకాల మాయోపాయాలకు పాల్పడతారని, వాటిని తిప్పి కొట్టాలని, సంపూర్ణ విజయం సాధించాలని పిలుపునిస్తూ వరుస ట్వీట్ లు చేశారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, 14 ఇయర్స్ సీఎం అని కోతలు కోస్తాడని చంద్రబాబుపై విమర్శలు చేశారు. పోలింగ్ ఇక పది రోజుల్లోనే ఉందని, ఇప్పటి వరకు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసే దమ్ము లేదని, కిందటి ఎన్నికల మ్యానిఫెస్టోని తన పార్టీ వెబ్ సైట్లో కనిపించకుండా తీసేశారని విమర్శించారు. ‘నిజాయతీ’ అన్న మాటకు వ్యతిరేకార్థం ఏదైనా ఉంటే అది చంద్రబాబే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.