Chandrababu: నాకు అనుమానం వస్తోంది... మరో కుట్ర పన్నుతున్న జగన్: చంద్రబాబునాయుడు
- ఒక రోజంతా హైదరాబాద్ లో మకాంవేశారు
- పార్టీ నాయకులంతా అప్రమత్తంగా ఉండాలి
- టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరో కుట్ర పన్నుతున్నారన్న అనుమానం తనకు వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎన్నికల ప్రచారాన్ని ఆపిమరీ, ఒక రోజంతా హైదరాబాద్ లో ఆయన ఉన్నాడంటే, మరో పన్నాగం పన్నుతున్నట్టేనని, టీడీపీ నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నేరస్థులతో నిండిన వైసీపీని ఎవరూ ఎక్కడా నమ్మవద్దని అన్నారు. పెన్షన్ డబ్బులను ఇప్పటికే లబ్ధిదారులకు అందించామని, ఎన్నికలకు ముందే పసుపు - కుంకుమ నుంచి రుణమాఫీ డబ్బులు, అన్నదాతా సుఖీభవ డబ్బులు వచ్చేస్తాయని అన్నారు. చెక్కులు చెల్లబోవని ప్రచారం చేస్తున్న వైసీపీ ఎలాంటి కుట్రలు చేయడానికైనా తెగబడుతోందని ఆరోపించారు. ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉందని గుర్తు చేసిన చంద్రబాబు, టీడీపీ అంటే ప్రజలు జైకొడుతున్నారని అన్నారు.